-
-
Home » Telangana » Rangareddy » Suicide of a youth in Rangareddy district-MRGS-Telangana
-
TS News: రంగారెడ్డి జిల్లాలో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-17T14:57:50+05:30 IST
జిల్లాలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్బీఆర్ కాలనీలో నాగార్జున(26) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి: జిల్లాలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్బీఆర్ కాలనీలో నాగార్జున(26) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘అమ్మ నాన్న నన్ను క్షమించండి’’ అంటూ సూసైడ్ నోట్ రాసి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చంపాపేట్ డీమార్ట్‌లో మృతుడు నాగార్జున పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.