-
-
Home » Telangana » Rangareddy » Study hard and achieve the goal-MRGS-Telangana
-
పట్టుదలతో చదివి లక్ష్యాన్ని ఛేదించాలి
ABN , First Publish Date - 2022-07-19T05:28:08+05:30 IST
పట్టుదలతో చదివి లక్ష్యాన్ని ఛేదించాలి

ఇబ్రహీంపట్నం, జూలై 18: విద్యార్థులు పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, కప్పాడు సర్పంచ్ సామల హంసమ్మలు అన్నారు. సోమవారం కప్పాడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఇంగ్లీష్ డిక్షనరీలు పంపిణీ చేశారు. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద కప్పాడు పాఠశాలకు రూ.22లక్షలు మంజూరైనట్లు తెలిపారు. మిషన్ భగీరథ ఏఈ ప్రణీత్, ఉప సర్పంచ్ ఎండీ మునీర్, ప్రధానోప్యాయుడు వెంకట్, ఎస్ఎంసీ చైర్మన్ అంజి ఉన్నారు.