విద్యార్థులు ప్రతిభను చూపాలి

ABN , First Publish Date - 2022-12-13T23:21:27+05:30 IST

పల్లె బడుల్లో చదివే విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్‌ లాంటి సంస్థలు ఇచ్చే చేయూతను అందిపుచ్చుకోవాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు.

విద్యార్థులు ప్రతిభను చూపాలి
పోస్టర్‌ను విడుదల చేస్తున్న చుక్కా రామయ్య

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 13: పల్లె బడుల్లో చదివే విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్‌ లాంటి సంస్థలు ఇచ్చే చేయూతను అందిపుచ్చుకోవాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. మంగళవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో రూరల్‌ జీనియస్‌ -2023 పోస్టర్‌ను నగరంలో చుక్కా రామయ్య ఆవిష్కరించారు. జీఎ్‌సఎఫ్‌ వ్యవస్థాపకులు సదా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థికి అభిరుచి ఉన్న అంశాల్లో సింగింగ్‌, పెయింటింగ్‌, యోగా, స్పీచ్‌, కబడ్డీ, వాలీబాల్‌, స్టెమ్‌ అంశాల్లో 200 మందిని గుర్తించి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎ్‌సఎఫ్‌ సభ్యులు శ్రీనివా్‌సగౌడ్‌ నరేష్‌, ప్రమోద, శ్రీశైలం ఉన్నారు.

Updated Date - 2022-12-13T23:21:27+05:30 IST

Read more