విద్యార్థులు శ్రద్ధగా చదవాలి : ఎంపీడీవో

ABN , First Publish Date - 2022-11-16T00:15:40+05:30 IST

విద్యార్థులు శ్రద్ధతో చదువుతూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎంపీడీవో శైలజారెడ్డి అన్నారు. మంగళవారం చైల్డ్‌లైన్‌-1098 వికారాబాద్‌ వారి ఆధ్వర్యంలో స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు.

విద్యార్థులు శ్రద్ధగా చదవాలి : ఎంపీడీవో

వికారాబాద్‌/మోమిన్‌పేట్‌/తాండూరు రూరల్‌/దోమ/ కొడంగల్‌/బొంరాస్‌పేట్‌/పరిగి, నవంబరు 15: విద్యార్థులు శ్రద్ధతో చదువుతూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎంపీడీవో శైలజారెడ్డి అన్నారు. మంగళవారం చైల్డ్‌లైన్‌-1098 వికారాబాద్‌ వారి ఆధ్వర్యంలో స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాలకు రాని పిల్లలు బడికి వచ్చి చదువుకునేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందించారు. ప్రత్యేకాధికారి రాములు, ఉపాధ్యాయులు చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు తదితరులున్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదవాలని మద్గుల్‌ చిట్టంపల్లి కౌన్సిలర్‌ గోపాల్‌ అన్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ భీమయ్య విద్యార్థులకు మెమెంటోలను బహూకరించారు. ఆట పాటలాడిన వారికి కౌన్సిలర్‌ బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా సుధాకర్‌ రెడ్డి, యాదయ్య వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయులు మల్లేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాండూరు మండలం రాంపూర్‌మీదితండా ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన నిర్వహించారు. ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ దేవ్లీబాయి, కార్యదర్శి యాదగిరి, ప్రధానోపాధ్యాయులు మనోహర్‌, మాజీ ఎంపీటీసీ పర్ష్యానాయక్‌ తదితరులున్నారు. దోమ మండలం కిష్టాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో స్వయం పరిపాలన జరుపుకున్నారు. హెచ్‌ఎం మహేంద్రబహదూర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చైల్డ్‌లైన్‌ 1098 తాండూర్‌ డివిజన్‌ వారి ఆధ్వర్యంలో బొంరాస్‌పేట్‌ మండలం బొట్లవని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. చైల్డ్‌లైన్‌ కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్‌, ప్రధానోపాధ్యాయుడు విక్రంసింగ్‌ తదితరులున్నారు. కొడంగల్‌ మండలం ఐనన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో టీఎల్‌యం మేళా నిర్వహించారు. హెచ్‌ఎం వేణుగోపాల్‌ మాట్లాడుతూ టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్స్‌ వాడకంతో విద్యార్థుల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడంతోపాటు ఉపాధ్యాయుడిని సమర్థవంతంగా చేస్తుందన్నారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ అమృతమ్మ తదితరులున్నారు. బాలల దినోత్సవం పరిగి మండల పరిధిలోని పలు పాఠశాలల్లో జరుపుకున్నారు. పరిగిలోని నవభారతి విద్యానికేతన్‌, గడ్డమీది ప్రాథమిక పాఠశాల, చిట్యాల్‌ ప్రాథమిక పాఠశాలలో వేడుకలను జరుపుకున్నారు.

Updated Date - 2022-11-16T00:16:06+05:30 IST