విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌, సెప్టెంబర్‌ 10: విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శనివారం పట్టణంలోని కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులకు బహుమతులు అందజేసి మెడిసినల్‌ గార్డెన్‌ను ప్రారంభించారు. సీటీవో శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ అపర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్‌  పట్టణంతో పాటు ధారూరు మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.12,24,200 విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, నాయకులు లంక్షా లక్ష్మీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, విజయ్‌ కుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి, దత్తు తదితరులు ఉన్నారు.


Read more