విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-11-19T00:10:28+05:30 IST

విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సీఐ లిక్కి కృష్ణంరాజు కోరారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
స్పోర్ట్స్‌ కిట్లు అందజేస్తున్న సీఐ, దాతలు

కందుకూరు, నవంబరు 18: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సీఐ లిక్కి కృష్ణంరాజు కోరారు. బాచుపల్లి పాఠశాల విద్యార్థులకు ఎంపీటీసీ సురేష్‌ సమకూర్చిన క్రీడా సామగ్రిని శుక్రవారం సీఐ అందజేశారు. విద్యార్థుల సేవకు ఎంపీటీసీ ముందుకు రావడం హర్షనీయం అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాలాల శ్రీనివాస్‌, కృష్ణ, శ్రీనివాస్‌, రాఘవేందర్‌, బాల్‌రెడ్డి, శేఖర్‌, పి.మధు, ఎ.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:10:28+05:30 IST

Read more