-
-
Home » Telangana » Rangareddy » Students must grow as literati DEO-NGTS-Telangana
-
విద్యార్థినులు సాహితీవేత్తలుగా ఎదగాలి : డీఈవో
ABN , First Publish Date - 2022-04-24T05:35:20+05:30 IST
విద్యార్థినులు సాహితీవేత్తలుగా ఎదగాలి : డీఈవో

వికారాబాద్, ఏప్రిల్ 27 : విద్యార్థినులు సాహితీవేత్తలు, రచయితలు, కవులుగా ఎదిగి తెలుగు సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని డీఈవో రేణుకాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సంఘం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 252 మంది విద్యార్థినులు రచించిన మణిపూసలు అనే కవితా సంకలనం, వికారాబాద్ విద్యార్థి మిణుగురులు అనే కవితా సంకలనానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు దక్కింది. శుక్రవారం సాయంత్రం పాఠశాలలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థినులను అభినందించారు. రికార్డ్స్ ఆసియా ఇన్చార్జి నరేందర్, ప్రిన్సిపాల్ రమణమ్మ, తెలుగు మాస్టర్ అంజిలప్ప తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్, ప్రముఖ న్యాయమూర్తి మధుసూదన్, విజయలక్ష్మి, మణిపూసల సృష్టికర్త వడిచర్ల సత్యం, మొలక ఇన్చార్జి వెంకటేశ్ పాల్గొన్నారు. అదేవిధంగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జిల్లా భరోసా కేంద్రం ఆధ్వర్యంలో సంఘం లక్ష్మీబాయి పాఠశాల, కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాటిక రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.