మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-02-20T04:45:35+05:30 IST

మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు

మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు
యాచారంలో కిరాణాదుకాణాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

యాచారం, ఫిబ్రవరి 19: దుకాణదారులు మాదకద్రవ్యాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాచారం ఎస్సై ప్రభాకర్‌ హెచ్చరించారు. శనివారం మాల్‌, యాచారం తదితర గ్రామాల్లోని కిరాణ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.  డ్రగ్స్‌, గంజాయి, యాష్కీ, గుట్కాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Read more