ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక సేవలు

ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST

ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక సేవలు

ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక సేవలు
ఆస్పత్రిని సందర్శించి డాక్టర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌, అక్టోబరు 1: ఇకపై వికారాబాద్‌ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో  అత్యాధునిక సేవలు  అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. శనివారం పట్టణంలోని  రాజీవ్‌నగర్‌ కాలనీలో సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలోని పెండింగ్‌ పనులను వెంటనే పూర్తిచేయాలని, పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్లు, సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ లంకా పుష్పలతారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవన్‌,  డాక్టర్లు శాంతప్ప, రమ్య, కౌన్సిలర్లు కొండేటి కృష్ణ, అనంత్‌రెడ్డి, గోపాల్‌, కృష్ణారెడ్డి,  రాజ్యలక్ష్మి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రమే్‌షగౌడ్‌, పాండు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more