-
-
Home » Telangana » Rangareddy » Stable governance with Congress-NGTS-Telangana
-
కాంగ్రె్‌సతోనే సుస్థిర పాలన
ABN , First Publish Date - 2022-08-15T05:57:04+05:30 IST
కాంగ్రె్‌సతోనే సుస్థిర పాలన

కొత్తూర్, ఆగస్టు 14: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సుస్థిర పాల న అందుతుందని షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూర్, మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్, స్టేషన్ తిమ్మాపూర్, కుమ్మరిగూడ గ్రామాల్లో అదివారం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. శంకర్ మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న దోపిడీలు, దౌర్జన్యాలను రూపుమాపాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజ లు మద్దుతు ఇవ్వాలన్నారు. ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, స మానత్వం కావాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. ఎంపీటీసీ కృష్ణ, రాంరెడ్డి, సత్తయ్య, హరినాథ్‌రెడ్డి, దేవేందర్, నర్సింహ, ప్రవీణ్‌రెడ్డి, భరత్, పాశం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.