జయ జానకి నాయకా!

ABN , First Publish Date - 2022-04-11T04:48:07+05:30 IST

జయ జానకి నాయకా!

జయ జానకి నాయకా!
వెంకటాద్రి టౌన్‌షిప్‌లో కల్యాణోత్సవంలో సీతమ్మ వారి మంగళసూత్రాన్ని చూపుతున్న పూజారి

వికారాబాద్‌,  ఏప్రిల్‌10( ఆంధ్రజ్యోతి ప్రతినిధి) నీలాకాశమే రంగుల పందిరిగా.. మెరిసే నక్షత్రాలే ముత్యాలుగా.. ఏకపత్నీవ్రతుడు.. పితృవాఖ్య పాలనాదక్షుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీసీతారాముల కల్యాణం  వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించి.. వాయిద్యాల మధ్యన కల్యాణ మండపానికి తీసుకొచ్చి  భక్తుల జయజయధ్వానాల మధ్య కనుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సీతమ్మకు మాంగల్య ధారణ గావించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పలు ఆలయాల్లో సకలగుణాభి రాముడు-సౌందర్యవతి సీతాదేవి కల్యాణ మహోత్సవంలో ప్రముఖులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ  నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు.

Read more