దుర్గామాతకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-10-01T05:35:26+05:30 IST

దుర్గామాతకు ప్రత్యేక పూజలు

దుర్గామాతకు ప్రత్యేక పూజలు
కీసర రూరల్‌ : నాగారం మున్సిపాలిటీ ఎల్లమ్మకాలనీలో అమ్మవారిని దర్శించుకుంటున్న కౌన్సిలర్‌ సబిత

వికారాబాద్‌/పెద్దేముల్‌/తాండూరు రూరల్‌/ఘట్‌కేసర్‌/మోమిన్‌పేట/కీసర రూరల్‌/శామీర్‌పేట/దోమ/కొడంగల్‌/కీసర/ధారూరు, సెప్టెంబరు 30 : దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ పట్టణంలోని శివాజీనగర్‌ కాలనీలో నెలకొల్సిన భవానీ అమ్మవారు శుక్రవారం లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈమేరకు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వేదపండితులు హోమం నిర్వహించి దంపతులతో పూజలు నిర్వహించారు. మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ లంకా పుష్పలతారెడ్డి లక్ష్మీకాంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్దేముల్‌ మండలం కందనెల్లి, తాండూరు మండలం అంతారంలో ప్రతిష్ఠించిన అమ్మవార్లు నిత్యపూజలు అందుకుంటున్నారు. కందనెల్లిలో అమ్మవారిని పెద్దేముల్‌ వైస్‌ ఎంపీపీ మధులత కుటుంబీకులతో కలిసి దర్శించుకొని పూజలు చేశారు. అంతారంలో ప్రతిష్ఠించిన అమ్మవారి వద్ద భక్తులు ప్రత్యేక పూజ చేశారు.

తాండూరులోని నగరేశ్వరాలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అంతకుముందు సామూహిక కుంకుమార్చన, మహా హారతి, ఆధ్యాత్మిక సంగీత నాట్య కార్యక్రమాలు, అల్పాహారం నిర్వహించినట్లు ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కోటం మురళీకృష్ణ తెలిపారు. దోమ మండల కేంద్రంలో ఎంపీటీసీ అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌ తదితరులు దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కొడంగల్‌ మండల పరిధిలోని హస్నాబాద్‌, పెద్దనందిగామ గ్రామాల్లో దుర్గమాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోమిన్‌పేట్‌ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరి జగన్మోహినిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. మండల మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య కుటుంబసభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శామీర్‌పేట మండలంలోని శ్రీగాయత్రి మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎస్‌విఎల్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో వేదబ్రహ్మణుల మంత్రోశ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

కీసరగుట్టలోని భవాని అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీశరన్నవరాత్రుల్లో భాగంగా కీసరగుట్టలో ఆలయ నిర్వహకులు చండీహోమం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘట్‌కేసర్‌ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పోచారంలో గల సర్వ మంగళా సమేత స్ఫటికలింగేశ ్వర అలయంలో అమ్మవారు మీనాక్షీదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మేడ్చల్‌ గడిమైసమ్మ అమ్మవారు మహాలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కీసర మండలం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. నాగారం మున్సిపాలిటీ ఎల్లమ్మ కాలనీలో ఏర్పాటుచేసిన మండపం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ఘనంగా చండీహోమం నిర్వహించారు.

నాగారం మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్‌ గూడూరు సబిత విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఆమెను అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. నాయకులు గూడూరు ఆంజనేయులుగౌడ్‌, కాలనీ అసోసియేషన్‌ అధ్యక్షుడు భిక్షపతిగౌడ్‌, ప్రసాద్‌, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, భిక్షపతిగౌడ్‌, పాండు, నరసింహారెడ్డి, స్థానిక మహిళలు పాల్గొన్నారు. దేవీశరన్నవరాత్రుల్లో ధారూరులోని వీరభద్రేశ్వరాయంలో అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో  భక్తులకు దర్శనమిచ్చారు.


Read more