కేసీఆర్‌ చొరవతోనే ప్రత్యేక గ్రామపంచాయతీలు

ABN , First Publish Date - 2022-10-01T05:34:23+05:30 IST

కేసీఆర్‌ చొరవతోనే ప్రత్యేక గ్రామపంచాయతీలు

కేసీఆర్‌ చొరవతోనే ప్రత్యేక గ్రామపంచాయతీలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌

మర్పల్లి, సెప్టెంబరు 30 : సీఎం కేసీఆర్‌ చొరవతోనే ప్రత్యేక గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మల్లికార్జున్‌గురి గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా ముఖ్య వీధుల్లో పర్యటించి గ్రామస్తులు ఎదుర్కొన్నంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బతుకమ్మ చీరలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ లలితరమేశ్‌, జడ్పీటీసీ మధుకర్‌, వైస్‌ఎంపీపీ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ లక్ష్మయ్య, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌లు పాండు, ఎంపీటీసీలు మల్లేశం, రవీందర్‌, నాయకులు అశోక్‌, గఫార్‌, గౌస్‌, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

  • వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కృషి

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ అన్నారు. మర్పల్లి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు మండల వీఆర్‌ఏలు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 


Read more