ఎస్‌ఐ మృతిపై ఎస్పీ సంతాపం

ABN , First Publish Date - 2022-08-17T05:47:42+05:30 IST

ఎస్‌ఐ మృతిపై ఎస్పీ సంతాపం

ఎస్‌ఐ మృతిపై ఎస్పీ సంతాపం

వికారాబాద్‌, ఆగస్టు 16 : అనంతగిరి గుట్టపై మొబైల్‌ పోలీసింగ్‌ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ లక్ష్మీనారాయణ సోమవారం రాత్రి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మంగళవారం ఎస్‌ఐ లక్ష్మీనారాయణ చేసిన సేవలను గుర్తుచేసుకుని, ఎస్‌ఐ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

Read more