త్వరలో వికారాబాద్‌లో మెడికల్‌ కళాశాల

ABN , First Publish Date - 2022-03-17T05:19:35+05:30 IST

త్వరలో వికారాబాద్‌లో మెడికల్‌ కళాశాల

త్వరలో వికారాబాద్‌లో మెడికల్‌ కళాశాల
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌

  • ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ వెల్లడి

వికారాబాద్‌, మార్చి 16: వికారాబాద్‌లో త్వరలో వైద్య కళాశాల ఏర్పాటు కాబోతుందని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. బుధవారం ఆయన వికారాబాద్‌లోని అతిథి గృహంలో నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్‌ ప్రాంతానికి మెడికల్‌, డిగ్రీ కళాశాలలు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే డయాలసిస్‌, డయాగ్నస్టిక్‌ సెంటర్లను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిల సహకారం, కృషితో వికారాబాద్‌కు మెడిక ల్‌ కళాశాల మంజూరైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో 91వేల ఉద్యోగ ప్రకటించార ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఇందుకు సన్నద్ధమ య్యే ఉద్యోగార్థులకు వికారాబాద్‌ అంబేద్కర్‌ భవనంలో సబితాఆనంద్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేసి ఉచిత కోచింగ్‌ ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులకు భోజనం, స్టడీ మెటీరియల్‌ ఇస్తామన్నారు. గిట్టని వారు కొందరు తనపై, ఎంపీపై విమర్శనలు చేస్తున్నారని, గుడ్లు అమ్ముకుంటారు, ఆపరేషన్లు చేస్తారంటూ విమర్శడం సరికాదన్నారు. విమర్శ ఏదైనా వ్యక్తిగతంగా కాకుండా పనితీరుపై ఉండాలని హితవు పలికారు. తాము విమర్శలకు దిగితే తట్టుకోలేరని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వికారాబాద్‌కు వస్తారని, కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని తెలిపా రు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తాను ప్రతి మండలంలో తిరుగుతానని, త్వరలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరవుతారన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, ఏఎంసీ చైర్‌పర్సన్‌ దీప, పాక్స్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ శంషద్‌బేగం, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, గోపాల్‌ పాల్గొన్నారు. 

  • పేదల ఆరోగ్య భద్రతకు భరోసా.. సీఎంఆర్‌ఎఫ్‌

పేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని ఎమ్మె ల్యే ఆనంద్‌ అన్నారు. తన క్యాంప్‌ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.9.56లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆధునిక పద్ధతుల్లో వైద్య సేవలందిస్తోందన్నారు.

Updated Date - 2022-03-17T05:19:35+05:30 IST