ఆసరా పింఛన్లతో లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు

ABN , First Publish Date - 2022-09-08T05:43:22+05:30 IST

ఆసరా పింఛన్లతో లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు

ఆసరా పింఛన్లతో లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు

నవాబుపేట, సెప్టెంబరు 7 : ఆసరా పింఛన్లతో లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని మూలమాడ, మామ్‌దాన్‌పల్లి, కుమ్మరిగూడ, కోజ్జవనం, కడ్జెర్ల, మాదారం, మీనపల్లికలాన్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను అందించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. 

  • ప్రభుత్వ పథకాలతో లబ్ధి

పరిగి, సెప్టెంబరు 7 : సీఎం కేసీఆర్‌ ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారని ఎంపీపీ అరవింద్‌రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగాపూర్‌, బసిరెడ్డిపల్లి, మాదారంగ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్ల ప్రొసీగింగ్స్‌ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

Read more