ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత

ABN , First Publish Date - 2022-03-19T04:47:22+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత

ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత
పాఠశాలలో ఆటలు ఆడుతున్న విద్యార్థులు

  • క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు 
  • చదువులకే పరిమితమవడంతో పెరిగిన ఒత్తిడి


మొయునాబాద్‌ రూరల్‌, మార్చి18: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడాలకు దూరమవుతున్నారు. దీంతో క్రీడాలు లేకపోవడంతో వారు నిత్యం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఆటలాడాలనే ఆసక్తి ఉన్నా విద్యార్థులకు ఆడిపించే కరువయ్యారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ సాయంత్రం గంటసేపు విద్యార్థులను క్రీడలు ఆడించేందుకు వ్యాయామోపాధ్యాయుడిని నియమించేవారు.  కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చిన్న వయసులోనే ఆటలకు విద్యార్థులు దూరమవుతున్నారు. దీంతో నిత్యం పుస్తకాలకే పరిమితం కావడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో భారీగా వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంపై అఽధికారులు దృష్టిసారించడం లేదు. మొయినాబాద్‌ మండలంలో ప్రాథమిక పాఠశాలలు 32, ప్రాథమిక ఉన్నత పాఠాలలు 5, ఉన్నత పాఠశాలలు 14 ఉన్నాయి. దాదాపు ఈ పాఠశాలల్లో 5 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీటితో పాటు ఎయిడెడ్‌, కేజీబీవీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. పెద్దమంగళారం, చందానగర్‌, కనకమామిడి, అజీజ్‌నగర్‌, చిలుకూరు పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. మిగతా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయులు కొనసాగుతున్న ఈ 5పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులను కేటాయించారు. మిగతా పాఠశాలల్లో సైతం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ నేటికీ వ్యాయామ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కొన్ని పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్‌ ద్వారా వ్యాయామ ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్తగా నియామకాలు జరగడం లేదు. దీంతో మండలంలోని వివిధ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక తాత్కాలికంగా సర్వశిక్షణ అభియాన్‌ కింద వ్యాయామ ఉపాధ్యాయులను నడుపుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో సైతం వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలువురు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో తరగతులు అయిపోయినా తరువాత క్రీడలు ఆడుకోనేందుకు విద్యార్థులను ఇంటికి పంపుతున్నారు.  ఏడాదికి ఒక్కటికి రెండు సార్లు నిర్వహించే క్రీడల పోటీల్లోనే విద్యార్థులు పాల్గోంటున్నారు. అప్పుడే వారికి క్రీడాలు ఆడుకోనేందుకు సమయం కేటాయిస్తున్నారు. ఆటలకు తగినంత సమయం కేటాయించక విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వ్యాయామ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి

ముదిగొండ మంజూల రవియాదవ్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలు

 గతంలో జరిగిన అనేక క్రీడాల పోటీల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి బహుమతులను గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించి పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి. 

క్రీడాలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు 

- షాపురం శ్రీకాంత్‌, విద్యార్థి సంఘం నాయకుడు, మొయునాబాద్‌

ఎన్నో సందర్భాల్లో క్రీడాల గురించి గొప్పాలు చెప్పే ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరతపై ఎందుకు స్పందించడం లేదు. వెంటనే ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. 

Updated Date - 2022-03-19T04:47:22+05:30 IST