-
-
Home » Telangana » Rangareddy » Sewage should be removed from the roads-NGTS-Telangana
-
రోడ్లపై మురునీటిని తొలగించాలి
ABN , First Publish Date - 2022-09-27T05:50:41+05:30 IST
రోడ్లపై మురునీటిని తొలగించాలి

శామీర్‌పేట, సెప్టెంబరు 26: దేవరయంజాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థతంగ ఉందని, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం దేవరయంజాల్లో మేయిన్రోడ్డుపై కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నా యకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. దేవరయంజాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీ నీరే పారుతోందన్నా రు. ప్రజలు దుర్వాసన భరించలేక నరకయాతనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీనీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.