ఆత్మస్థైర్యం విజయానికి దోహదం

ABN , First Publish Date - 2022-12-02T00:12:58+05:30 IST

ఆత్మస్థైర్యం విజయానికి దోహదమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

ఆత్మస్థైర్యం విజయానికి దోహదం
భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న శ్రీనివా్‌సరెడ్డి

ఆమనగల్లు, డిసెంబరు 1: ఆత్మస్థైర్యం విజయానికి దోహదమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఆమనగల్లు మండలం పులిగోనిపల్లి తండాకు చెందిన బాణావత్‌ రాహుల్‌, బాణావత్‌ అనిల్‌లు డెహరాడూన్‌లో నిర్వహించనున్న అండర్‌-19 రాష్ట్రస్థాయి ఆల్‌స్టార్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆమనగల్లు పట్టణంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులను సత్కరించారు. వారితో పాటు యువకులకు క్రికెట్‌ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్‌ సర్పంచ్‌ గోరటి శ్రీను, ఆమనగల్లు మార్కెట్‌ డైరెక్టర్‌ సురమల్ల సుభాష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రూపం వెంకట్‌రెడ్డి, నాగులు నాయక్‌, శంకర్‌ నాయక్‌, రాములు, సుమన్‌ నాయక్‌, వడ్డెమోని శివకుమార్‌, శేఖర్‌, వినోద్‌, రైసల్‌, ధర్మ నాయక్‌, కళ్యాణ్‌, మహేశ్‌, గణేశ్‌, చింటు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:12:59+05:30 IST