జాతీయ స్థాయి లంగడి పోటీలకు ఎంపిక

ABN , First Publish Date - 2022-12-06T23:59:30+05:30 IST

జాతీయ స్థాయి అండర్‌-12వ లంగడి పోటీలకు తెలంగాణ తరపున బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు.

జాతీయ స్థాయి లంగడి పోటీలకు ఎంపిక

కడ్తాల్‌, డిసెంబరు 6: జాతీయ స్థాయి అండర్‌-12వ లంగడి పోటీలకు తెలంగాణ తరపున బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. ఈనెల 10, 11వ తేదీలలో మహారాష్ట్రలోని చింబోనిలో నిర్వహించే 12వ జూనియర్‌ జాతీయస్థాయి లంగడి పోటీలకు తెలంగాణ టీం ఎంపికకు కడ్తాల జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. తెలంగాణ లంగడి అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.చంద్రమోహన్‌, క్రీడల కన్వీనర్‌ జంగయ్యల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 200ల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి జాతీయ స్థాయి పోటీలకు బాలుర జట్టుకు 15, బాలికల జట్లుకు 15 మందిని ఎంపిక చేశారు.

Updated Date - 2022-12-06T23:59:31+05:30 IST