గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

దౌల్తాబాద్‌. జులై 3: రూ.40వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం గుర్మిట్‌కాల్‌ నుంచి దౌల్తాబాద్‌ మండల కేంద్రం మీదుగా కొడంగల్‌కు ఆటోలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న హమీద్‌ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఆరా తీయగా.. కొడంగల్‌ పట్టణంలోని ఓ పాన్‌షాప్‌ యజమాని ఫైజల్‌ అనే వ్యక్తి సూచనల మేరకు నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఆటోను, నిషేధిత గుట్కా ప్యాకెట్లను దౌల్తాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ దేవదాసు తెలిపారు.

Read more