1.17కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

1.17కిలోల గంజాయి పట్టివేత

1.17కిలోల గంజాయి పట్టివేత
గంజాయి, యువకుడిని పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 29: 1కిలో 170గ్రాముల గంజాయిని మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకొని తరలిస్తున్న యువకుడిని అరెస్టు చేశారు. ఎక్సైజ్‌ సీఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధి మేడిపల్లి గణేష్‌ నగర్‌కు చెందిన ఉప్పల విజయ్‌కుమార్‌(21) గురువారం గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం, ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు చెంగిచెర్ల పెట్రోల్‌ పంపు వద్ద తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయ్‌కుమార్‌ బ్యాగును తనిఖీ చేయగా.. దానిలో కిలో 170గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. నిందితుడు గంజాయిని ఏపీలోని అరకు నుంచి తక్కువ ధరకు తెచ్చి ఈప్రాంతంలో ఎక్కవ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read more