-
-
Home » Telangana » Rangareddy » Satyasai Baba worships in glory-MRGS-Telangana
-
వైభవంగా సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు
ABN , First Publish Date - 2022-04-25T05:16:19+05:30 IST
వైభవంగా సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు

ఆమనగల్లు/షాద్‌నగర్/కొత్తూర్, ఏప్రిల్ 24: శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 11వ ఆరాధనోత్సవ వేడుకలు ఆమనగల్లు పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సత్యసాయి భక్తులు, సేవాసమితిసభ్యులు, పట్టణప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు సత్యసారు భక్తులు భజనలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సాయినామస్మరణతో ఆమనగల్లు పట్టణం మార్మోగింది. సత్యసాయి సేవాసమితి కన్వీనర్ దొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధనోత్సవ వేడుకలకు సీఐ ఉపేందర్, ఎస్‌ఐ ధర్మేశ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం సాయిభజనలు, కీర్తనలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నారాయణ సేవలో భాగంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి సభ్యులు డాక్టర్ దొంతు పుల్లయ్య, ఆమనగంటి సంజీవ్‌కుమార్, ఎన్‌ఆర్.ప్రభాకర్, కృష్ణారెడ్డి, గోల్డ్ రాము, పోలిశెట్టి శ్రీను, మూర్తి, రామాచారి, బ్రహ్మం, శ్రీశైలం, అల్లాజీ, శంకర్, జగన్మోహన్, అప్పం తిరుపతయ్య, అలివేలమ్మ, సుజాత, సంధ్య, సింధు, అనిత, గుర్రం సురేశ్, ఇట్టే రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం నగర సంకీర్తన, సాయిబాబా మందిరంలో భజన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో పాటు, నవోదయ వృద్ధాశ్రమంలో వృద్ధులు, అనాథలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సత్యసాయి సేవాసమితి కన్వీనర్ ఎం.వెంకటయ్య, సత్యసాయి సేవాదళ్ కె.శ్రీనివా్‌సరెడ్డి, రామకృష్ణారెడ్డి, రామచంద్రయ్య, రాములు, దామోదర్‌రెడ్డి, జయమ్మ, శ్రీశైలం పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్ మున్సిపాలిటీలోని కుమ్మరిగూడ గ్రామంలో శ్రీ సత్యసాయిబాబా ఆరాధానోత్సవాన్ని గ్రామస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సత్యసాయిబాబా చిత్రపటాన్ని ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, భజనలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాదవిగోపాల్, సత్యసాయి సమితీ కన్వీనర్ బసవరాజు, సుధా, శ్రీనివాస్, అదిత్య, అరవింద్, కళ్యాణీ, ఉమా పాల్గొన్నారు.