భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

ABN , First Publish Date - 2022-09-11T05:02:43+05:30 IST

భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు

  • హోమాలు, పూజలు నిర్వహించిన భక్తులు
  • పాల్గొన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి, స్థానిక నాయకులు

కడ్తాల్‌, సెప్టెంబరు 10: అన్మా్‌సపల్లిలోని వీరాంజనేయస్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, హోమాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. గోవిందాయిపల్లి సర్పం చ్‌ రామునాయక్‌ నీలవేణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవా ధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఆమనగల్లు బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు బిక్యానాయక్‌, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మనాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు కార్యక్రమానికి తరలి వచ్చారు. సాయంత్రం వరకు పూజలు, హోమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా నిర్వాహకుడు రాము అతిథులను సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.నర్సింహ, ప్యాక్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌, సేవ్య, లాయక్‌అలీ, లక్ష్మయ్య, లక్‌పతినాయక్‌, అశోక్‌, పి.వెంకటేశ్‌, హీరాసింగ్‌, శేఖర్‌గౌడ్‌, దుద్యానాయక్‌, వెంకటయ్య, పాండునాయక్‌, చత్రునాయక్‌, రాజు, రాజేందర్‌, శంకర్‌, ముత్యాలి, సోన,అరుణ, జ్యోతి, సునీత, జవహర్‌ నాయక్‌, శ్రీను, మాలధారులు పాల్గొన్నారు.

Read more