నేడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-08-18T05:13:47+05:30 IST

నేడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ

నేడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ

తాండూరు రూరల్‌/తాండూరు, ఆగస్టు 17 : సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 372వ జయంతిని పురస్కరించుకుని నేడు(గురువారం) తాండూరు మండలం కరన్‌కోట్‌లో పాపన్నగౌడ్‌ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు గౌడ సంఘం నాయకులు బాలేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు గ్రామంలో కార్యక్రమం ఉంటుందని, తాండూరు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల గౌడ కులపెద్దలు, బీసీ, ప్రజాసంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా నేడు తాండూరు పట్టణంలోని పోట్లి మహరాజ్‌ దేవాలయంలో సర్వాయి పాపన్నగౌడ్‌  372వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గౌడ సంఘం ప్రతినిధి ఎస్‌.నారాయణగౌడ్‌ తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఉదయం 10గంటలకు తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో అధికారికంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గౌడ, బీసీ కుల సం ఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read more