వైఎ్‌సఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వర్‌

ABN , First Publish Date - 2022-09-19T05:42:14+05:30 IST

వైఎ్‌సఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వర్‌

వైఎ్‌సఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వర్‌

వికారాబాద్‌, సెప్టెంబరు 18 : వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్‌ పట్టణానికి చెందిన మామిడి సంగమేశ్వర్‌ను నియమిస్తూ ఆ పార్టీ అఽధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదివారం పాదయాత్రలో భాగంగా నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంగమేశ్వర్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీ అధినేత్రి షర్మిలకు రుణపడి ఉంటానన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి.. మళ్లీ రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తానని తెలిపారు. కాగా, ఈనెల 21నుంచి వికారాబాద్‌ జిల్లాలో షర్మిల పాదయాత్ర ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అన్నారు.


Read more