రైతుబంధు, పింఛన్‌ డబ్బుల కోసం.. తండ్రిపై కుమారుడి దాడి

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

రైతుబంధు, పింఛన్‌ డబ్బుల కోసం.. తండ్రిపై కుమారుడి దాడి

రైతుబంధు, పింఛన్‌ డబ్బుల కోసం..  తండ్రిపై కుమారుడి దాడి

దోమ, సెప్టెంబరు 10 : రైతుబంధు, పింఛన్‌ డబ్బుల కోసం తండ్రిపై కొడుకు కర్రతో దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దోమ మండల పరిధిలోని బాసుపల్లి గ్రామానికి చెందిన తెలుగు రామయ్యకు ముగ్గురు కుమారులున్నారు. దీంతో ఆయనకున్న 6 ఎకరాల పొలంలో కొంత భాగం కుమారుల పేరున రాసిచ్చాడు. అసైన్డ్‌మెంట్‌ భూమి 4 ఎకరాలకుపైగా రామయ్య పేరుపై ఉంది. కాగా, కుమారులు రామయ్యను ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో పొలం దగ్గర గుడిసె వేసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. కొన్ని నెలల నుంచి చిన్న కుమారుడు చంద్రయ్య తండ్రిని పింఛన్‌, రైతుబంధు డబ్బులకోసం వేధించేవాడని బాధితుడు తెలిపాడు. నాలుగు రోజుల క్రితం పింఛన్‌ డబ్బుల కోసం కర్రతో తండ్రిపై చంద్రయ్య దాడి చేశాడు. ఈ విషయాన్ని బాధితుడు పోలీ్‌సలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఈ విషయంపై ఎస్‌ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా నేను నగరానికి బందోబస్తుకు వెళ్లానని, ఆ విషయం క్రింది స్థాయి సిబ్బంది తన దృష్టికి తీసుకురాలేదని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


Read more