తండాలకు రోడ్లు వేయాలి

ABN , First Publish Date - 2022-02-20T05:21:18+05:30 IST

తండాలకు రోడ్లు వేయాలి

తండాలకు రోడ్లు వేయాలి

బొంరా్‌సపేట్‌, ఫిబ్రవరి 19: అటవీ ప్రాంతాల్లో ఉన్న తండాలకు రోడ్లు వేసేందుకు అనుమతులు ఇవ్వాలని బొంరా్‌సపేట్‌ జడ్పీటీసీ అరుణదేశ్యుచౌహాన్‌ కలెక్టర్‌ నిఖిలను కలిసి వినతిపత్రం అందించారు. బొంరాస్‌ మండల పరిధిలోని మెట్టుచెల్కతండా, గిర్కబాయి తండా, గుడేలుకుచ్చ తండా, గుబ్బడితండా తదితర తండాలు అటవీ ప్రాంతాల్లో ఉండటంతో ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని విషయాన్ని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్‌ జిల్లా అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు.  దేశ్యనాయక్‌ తదితరులు ఉన్నారు.

Read more