రిలే నిరాహార దీక్ష విరమణ

ABN , First Publish Date - 2022-07-06T04:41:50+05:30 IST

మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలో అక్రమంగా

రిలే నిరాహార దీక్ష విరమణ
దీక్షలను విరమింపచేస్తున్న తహసీల్దార్‌, ఎస్‌ఐ

తలకొండపల్లి, జూలై 5: మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌ పనులను నిలిపివేసి.. ఆ భూమిలో పట్టాలు ఇవ్వాలని 34 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం తహసీల్దార్‌ కృష్ణ, ఆర్‌ఐ మంజుల, ఎస్‌ఐ శివశంకర వరప్రసాద్‌ సందర్శించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శిబిరానికి చేరుకున్న అధికారులు 30రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత రైతులు సానుకూలంగా స్పందించడంతో అధికారులు వారికి నిమ్మరసం ఇచ్చి రిలే దీక్షలను విరమింపజేశారు. నెలరోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తిరిగి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్‌ యాదగిరి, సర్పంచ్‌లు బండి రఘుపతి, లలితజ్యోతయ్య, లక్ష్మణ్‌, ఉపసర్పంచ్‌ దేవేందర్‌, అనిల్‌, యాదయ్య, బాధిత రైతులు జంగయ్య, రమేశ్‌, మల్లేశ్‌, పరమేశ్‌, బాబమ్మ, లక్ష్మీబాయి, రాజేశ్వరి, నిర్మలమ్మ, శివాజీ, , రాకేశ్‌, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. Read more