అర్హులకే పోడు హక్కు పత్రాలు

ABN , First Publish Date - 2022-12-13T00:15:14+05:30 IST

పోడు భూముల్లో సేద్యం చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులే హక్కుపత్రాలు పొందేందుకు అర్హులని కలెక్టర్‌ కె.నిఖిల అన్నారు.

అర్హులకే పోడు హక్కు పత్రాలు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల

జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోడు భూముల్లో సేద్యం చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులే హక్కుపత్రాలు పొందేందుకు అర్హులని కలెక్టర్‌ కె.నిఖిల అన్నారు. పోడుభూముల కేటాయింపులపై సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పోడుభూముల్లో సాగుచేస్తున్న రైతుల వివరాలు ఇప్పటికే సేకరించారని, అర్హతున్న వారిని ఎంపిక చేస్తామన్నారు. అర్హతున్నా ఏవైనా కారణాలతో దరఖాస్తులు తిరస్కరిస్తే సబ్‌డివిజన్‌ లెవల్‌ కమిటీకి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అటవీ ప్రాంత సరిహద్దు బయటి భూములకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోం కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్వో అశోక్‌కుమార్‌, డీఎ్‌ఫవో వెంకటేశ్వర్‌రెడ్డి, డీటీడబ్ల్యువో కోటాజీ, కమిటీ సభ్యులు, ధారూరు, కులకచర్ల, పెద్దేముల్‌, బొంరా్‌సపేట్‌ మండలాల జడ్పీటీసీలు సుజాత, రాందా్‌సనాయక్‌, మంజుల అరుణ దేశు చౌహాన్‌, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:15:14+05:30 IST

Read more