దోర్నాల వాగుపై బ్రిడ్జికి మరమ్మతులు

ABN , First Publish Date - 2022-10-05T05:13:23+05:30 IST

దోర్నాల వాగుపై బ్రిడ్జికి మరమ్మతులు

దోర్నాల వాగుపై బ్రిడ్జికి మరమ్మతులు
బ్రిడ్జిపై తాత్కాలికంగా పోసిన మట్టి

ధారూరు, అక్టోబరు 4: మండల పరిధిలోని దోర్నాల వాగు తాత్కాలిక వంతెనపై తేలిన పైపుల మీద ఆర్‌అండ్‌బీ అధికారులు మట్టిపోయించి మరమ్మతులు చేయించారు. దీంతో మంగళవారం  ధారూరు-దోర్నాల వైపునకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలకు బ్రిడ్జి కొట్టుకుపోయి దోర్నాలతో పాటు చుట్టపక్కల గ్రామాలకు ధారూరు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జైదుపల్లి, కేరెల్లి మీదుగా 40కిలో మీటర్లు ప్రయాణించి ధారూరుకు రాకపోకలు సాగించారు. వర్షాలు తగ్గిపోవటంతో కాంట్రాక్టర్‌ తాత్కాలిక వంతెనపై మట్టిపోసి మరమ్మతులు చేయటంతో దోర్నాల వైపు నుంచి ధారూరుకు వాహనాల రాకపోకలు ప్రారంభమై ప్రజలకు రవాణ సౌకర్యం కలిగింది.

Read more