నాటుసారా అమ్ముతున్న ఇద్దరు మహిళల రిమాండ్‌

ABN , First Publish Date - 2022-03-17T04:52:01+05:30 IST

నాటుసారా అమ్ముతున్న ఇద్దరు మహిళల రిమాండ్‌

నాటుసారా అమ్ముతున్న ఇద్దరు మహిళల రిమాండ్‌

కందుకూరు, మార్చి 16: నాటు సారా విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్‌ సీఐ వీణారెడ్డి తెలిపారు. మండలంలోని పోతుబండతండాకు చెందిన విస్లావత్‌ చిట్టి, విస్లావత్‌ స్వరూపలు అదే గ్రామంలో నాటుసారా అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎకైజ్‌ ఎస్‌ఐ హనుమంత్‌ నాయక్‌ మంగళవారం దాడులు నిర్వహించారు. నాలుగు లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మంగళవారం సాయంత్రం వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

Read more