తాండూరు చైర్‌పర్సన్‌, కమిషనర్‌ వాదనల రికార్డు

ABN , First Publish Date - 2022-11-30T00:20:50+05:30 IST

హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ అశోక్‌కుమార్‌ వాదనలను వినిపించారు.

తాండూరు చైర్‌పర్సన్‌, కమిషనర్‌ వాదనల రికార్డు

వారం రోజుల్లో హైకోర్టుకు నివేదన : సీడీఎంఏ

తాండూరు, నవంబరు, 29 : హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ అశోక్‌కుమార్‌ వాదనలను వినిపించారు. సీడీఎంఏ సత్యనారాయణ వీరి వాదనలు వినగా.. నివేదికను ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌కు ఇవ్వనున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తాండూరు మున్సిపాలిటీకి సంబఽంధించి తనకు తెలియకుండా బడ్జెట్‌ ఆమోదం, తన సంతకం లేకుండా ఎజెండా తయారు చేయడం, తాను ఎజెండా తయారు చేసిన వాటిపై సమావేశం నిర్వహించేందుకు ఇన్‌చార్జి కమిషనర్‌ నిరాకరించడం వంటి వాటిపై చైర్‌పర్సన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. దీంతో ఈ సమస్యపై వాదోపవాదనలు విని కోర్టుకు నివేదిక ఇవ్వాలని ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించిన విషయం విధితమే. ఈ వాదనలు విన్న ముఖ్య కార్యదర్శి తరపు సీడీఎంఏ సత్యనారాయణ ముఖ్యకార్యదర్శికి నివేదిక అందజేయనున్నారు. అట్టి నివేదికను వారం రోజుల్లో కోర్టుకు నివేదించనున్నారు.

Updated Date - 2022-11-30T00:20:50+05:30 IST

Read more