మోమిన్‌పేట ఇన్‌చార్జి తహసీల్దార్‌గా రవీందర్‌ దత్తు

ABN , First Publish Date - 2022-03-17T05:17:07+05:30 IST

మోమిన్‌పేట ఇన్‌చార్జి తహసీల్దార్‌గా రవీందర్‌ దత్తు

మోమిన్‌పేట ఇన్‌చార్జి తహసీల్దార్‌గా రవీందర్‌ దత్తు

మోమిన్‌పేట, మార్చి 16 : మోమిన్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లడంతో ఉప తహసీల్దార్‌గా పనిచేస్తున్న రవీందర్‌ దత్తు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు ఆయనను శాలువతో సత్కరించారు. ఎంతో కాలంగా మండల ఉప తహసీల్దార్‌గా పనిచేస్తున్న రవీందర్‌ దత్తుకు ఇక్కడి రెవెన్యూ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, అందుకు పూర్తిస్థాయిలో తహసీల్దార్‌గా బాధ్యతలిస్తే బాగుంటుందని పార్టీ తరపున కలెక్టర్‌ను కోరారు. నాయకులు సిరాజుద్దిన్‌, తదితరులున్నారు.

Read more