రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-08-21T06:08:40+05:30 IST

రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం

రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం
షాద్‌నగర్‌ అర్బన్‌: జయంతి వేడుకల్లో వీర్లపల్లి శంకర్‌, పార్టీ నాయకులు

షాద్‌నగర్‌ అర్బన్‌/ కందుకూరు/ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/మాడ్గుల/ /నందిగామ/చేవెళ్ల/మొయినాబాద్‌/యాచారం, ఆగస్టు 20: రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.  షాద్‌నగర్‌లో పార్టీ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నాయకులు బాబర్‌ఖాన్‌, జి.బాల్‌రాజ్‌గౌడ్‌, కె.చెన్నయ్య, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జంగ నర్సింహాయాదవ్‌, చెంది తిరుపతి, రఘు, కొమ్ము కృష్ణ, పురుషోత్తంరెడ్డి, సాయులు, ఖదీర్‌, మోహన్‌, రాజేందర్‌రెడ్డి ఉన్నారు.  కందుకూరులో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కృష్ణానాయక్‌ ఆధ్వర్యంలో పార్టీ మండల శాఖ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఢిల్లీ శ్రీధర్‌, ఎండీ అబ్జల్‌భేగ్‌, సయ్యద్‌ అజీజ్‌, వినోద్‌చారి, జగన్‌, పాండురంగారెడ్డి, రాజు, మల్లయ్య, నేచ్చానాయక్‌, బి.భాస్కర్‌, ఎస్‌.గణేష్‌, ఉపేందర్‌, పి.మహేందర్‌, బి.మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మండల కేంద్రాల్లో పార్టీ మండల అధ్యక్షుడు మండ్లీ రాములు, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్‌గౌడ్‌, తలకొండపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌లు రాజీవ్‌గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేగూరి వెంకటేశ్‌, జహంగీర్‌బాబా, ఖలీల్‌, వస్పుల మానయ్య, వస్పుల శ్రీశైలం, దశరథం, మోహన్‌ రెడ్డి, మిట్టపల్లి అంజయ్య పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గులలో రేవంత్‌రెడ్డి మిత్ర మండలి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపారు. నాయకులు హుస్సేన్‌, భాస్కర్‌ ఉన్నారు.  అదేవిధంగా నందిగామలో పార్టీ మండల అధ్యక్షుడు జంగ నర్సింహులు కేక్‌ కట్‌ చేశారు. రాంరెడ్డి, కృష్ణ, కుమార్‌గౌడ్‌, చంద్రపాల్‌రెడ్డి, రాజగోపాల్‌ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్లలో నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు సున్నపు వసంతం, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌, చేవెళ్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పెంటయ్యగౌడ్‌, చేవెళ్ల మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి మండల కేంద్రంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పెంటయ్యగౌడ్‌, జి.రాములు, మల్లేశ్‌, పెంటారెడ్డి, మద్దెల మల్లేశ్‌ ఉన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌లో పార్టీ మండల అధ్యక్షుడు మణెయ్య హిమయత్‌ నగర్‌, అజీజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఏసీఏస్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి,   రాములు, రామ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి ఉన్నారు. అదేవిధంగా యాచారంలో ఉప్పల భాస్కర్‌, జయప్రకాష్‌, రాజేష్‌ నివాళులర్పించారు.

Read more