వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం
బొంరా్‌సపేట్‌లో కురుస్తున్న వర్షం

  • అత్యధికంగా దోమలో 75.5మి.మీ నమోదు 

వికారాబాద్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/బొంరా్‌సపేట్‌/పరిగి/వికారాబాద్‌/ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 29: వికారాబాద్‌ జిల్లాలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం ప్రారంభమైరాత్రి వరకూ కొనసాగింది. రాత్రి 7.30గంటల వరకు జిల్లాలో అత్యధికంగా దోమ మండలంలో 75.5మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముజాహిద్‌పూర్‌లో 57.8మి.మీ, బొంరా్‌సపేట్‌లో 54.8మి.మీ, బషీరాబాద్‌లో 39.3మి.మీ, పరిగి 35మి.మీ, కాశీంపూర్‌ 33.8 మి.మీ, యాలాల్‌ 24.5 మి.మీ, దావల్‌పూర్‌ 22మి.మీ, కొడంగల్‌ 21.3 మి.మీ, దుద్యాల్‌ 19.5 మి.మీ, దౌల్తాబాద్‌ 16.5మి.మీ, మన్నెగూడ 6.3మి.మీ, కోట్‌పల్లి 2మి.మీ, వికారాబాద్‌ మండలం మద్గుల్‌ చిట్టంపల్లిలో 1.5 మి.మీ చొప్పున వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా బండ్లగూడలో 36మిల్లీ మీటర్లు, మేడిపల్లిలో 22మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. బొంరా్‌సపేట్‌ మండలంలో 15రోజులుగా వర్షాల్లేక మెట్ట పంటలు ఎండే పరిస్థితి నెలకొంది. ఈ వర్షం కంది, పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసింది. వేరుశనగ విత్తేందుకు అనుకూలంగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. పరిగి సబ్‌డివిజన్‌ పరిధిలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇరవై రోజుల తర్వాత పడింది. వికారాబాద్‌లో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో రోడ్లపై నీరు ప్రవహించింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలో భారీ వర్షం కురిసింది. ఘట్‌కేసర్‌, అవుషాపూర్‌, అంకుషాపూర్‌, ఎదులాబాద్‌ గ్రామాల్లో వాన కురిసింది. పోచారం పరిధి నారపల్లి, చౌదరిగూడల్లో వర్షం పడింది. చౌదరిగూడ హిమగిరి, స్వర్ణగిరి, యాదాద్రి కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి ఫ్యాన్లు, తదితర ఎలక్ర్టానిక్‌ వస్తువులు కాలిపోయాయి.

Updated Date - 2022-09-29T05:30:00+05:30 IST