లక్ష్మీవేంకటేశ్వరాలయంలో ఘనంగా పుష్పయాగం

ABN , First Publish Date - 2022-11-21T00:12:17+05:30 IST

షాద్‌నగర్‌కు ముఖద్వారంగా వెలసిన గోదా సమేత లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పుష్పయాగా న్ని నిర్వహించారు.

లక్ష్మీవేంకటేశ్వరాలయంలో ఘనంగా పుష్పయాగం

షాద్‌నగర్‌ అర్బన్‌, నవంబరు 20: షాద్‌నగర్‌కు ముఖద్వారంగా వెలసిన గోదా సమేత లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పుష్పయాగా న్ని నిర్వహించారు. పవిత్రోత్సవాలను పురష్కరించుకొని పూర్ణాహుతి, పవిత్రారోహణ, అష్టోత్తర శతకలశాభిషేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు 108 కలశాలతో అభిషేకాలు, రకరకాల పూలతో పుష్పయాగం నిర్వహి ంచారు. పండితులను, అతిథులను నర్సింహులు సన్మానిం చారు. పూజల్లో ఏంపీకి చెందిన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర దంపతులు, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, ప్రకా్‌షగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.జగన్‌మోహన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, పారిశ్రామికవేత్త సురేంద్ర, టీడీపీ నాయకులు ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, నర్సిరెడ్డి, గోపాల్‌రెడ్డి, సుభా్‌షయాదవ్‌, యాదగౌడ్‌, పురప్రముఖులు బాల్‌రాజ్‌గుప్తా, వెంకటసాయిశ్వర్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌, ప్రతా్‌పరెడ్డి, అంతయ్య, నర్సింహులుగుప్తా, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:12:17+05:30 IST

Read more