దుర్గామాత అలంకరణలో అమ్మవారికి పూజలు

ABN , First Publish Date - 2022-10-04T05:42:46+05:30 IST

దుర్గామాత అలంకరణలో అమ్మవారికి పూజలు

దుర్గామాత అలంకరణలో అమ్మవారికి పూజలు
తాండూరు కాళికాదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తదితరులు

కులకచర్ల/దోమ, కీసర/తాండూరు/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌, అక్టోబరు 3: దేవీనవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారిని దుర్గామాత అలంకరణలో పూజలు నిర్వహించారు. కులకచర్ల మండలం తిర్మలాపూర్‌ మండపం వద్ద కుంకుమార్చనలు నిర్వహించారు. పాంబండపై అమ్మవారి మండపంలో హోమం నిర్వహించారు. దోమ, ఐనాపూర్‌, మోత్కుర్‌ గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ రాజిరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సిద్ధిరాములు, లక్ష్మయ్య, యాదయ్యగౌడ్‌, నందు, రాజేందర్‌ పాల్గొన్నారు. కీసర కీసరగుట్టలో దసరాదేవి అ మ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. తాండూరులోని కాళికాదేవి ఆలయంలో ఎ మ్మెల్సీ మహేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, నాయకులు కరణం పురుషోత్తంరావు, విజయలక్ష్మి, ప్యాక్స్‌ చైర్మన్‌ రవిగౌడ్‌ ఉన్నారు. తాండూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌ సంగీతాఠాగూర్‌ 9మంది కన్యలను దుర్గామాత రూపంలో పూజించారు. తాండూరు పట్టణం నగరేశ్వర ఆలయంలో కన్యకాపరమేశ్వరిని తమలపాకుల తో అలంకరించి పూజించారు. శామీర్‌పేటలోని శ్రీగాయత్రి మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ స్థాపకులు ఎస్‌వీఎల్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో పూ జలు నిర్వహిస్తున్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో అమ్మవారి మండపం వద్ద సింగం రాజు ఆధ్వర్యంలో పూజలు చేస్తున్నారు. ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లో దుర్గాదేవి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు పన్నాలకొ ండల్‌రెడ్డి దంపతులు, పోచిరెడ్డి, ప్రతాపరెడ్డి, మొహన్‌రెడ్డి, పంచాయతీ శ్రీనివా్‌సగౌడ్‌, జగదీష్‌, జంగయ్య, సత్యనారాయణ, పరుశరాములు, రాజశేఖర్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌లోని గురుకుల్‌ కళాశాల మైదానంలో దుర్గామాత మండపంలో పూజలు నిర్వహించారు. శివప్రదీ్‌పరె డ్డి, విక్రాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

Read more