అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-02-20T04:50:17+05:30 IST

అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వాలి

అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వాలి

ఆమనగల్లు, ఫిబ్రవరి 19: ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు విధిగా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని పలువురు సభ్యులు మండలసభలో ప్రస్తావించారు. ఆమనగల్లు మండల సర్వసభ్య సమావేశం శనివారం మండల పరిషత్‌ సమావేశ భవనంలో ఎంపీపీ నేనావత్‌ అనితవిజయ్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌, వైస్‌ఎంపీపీ జక్కు అనంతరెడ్డిలు పాల్గొన్నారు. సమావేశానికి ఎంపీపీ, వైస్‌ఎంపీపీతో పాటు ఒక ఎంపీటీసీ, ఇద్దరు సర్పంచులు మాత్రమే హాజరు కావడంతో మండలసభ మొక్కుబడిగా కొనసాగింది. సభ ప్రారంభం కాగానే శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి కొందరు అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని వైస్‌ఎంపీపీ జక్కు అనంతరెడ్డి సభలో ప్రస్తావించగా ఇకపై విధిగా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఎంపీపీ అనిత విజయ్‌, ఎంపీడీవో వెంకట్రాములు అధికారులకు సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ పాండు నాయక్‌, ఎంఈవో సర్దార్‌నాయక్‌, ఏపీవో కృష్ణయ్య, ఏపీఎం మాధవరెడ్డి, ఎక్సైజ్‌ ఎస్‌ఐ యాదయ్య, శిక్షణ ఎస్‌ఐ ప్రదీ్‌పకుమార్‌, ఏవో అరుణ కుమారి, ఏఈలు సీతారామ్‌, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read more