కరెంట్‌ కోతలతో ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-09-11T05:18:13+05:30 IST

కరెంట్‌ కోతలతో ఇబ్బందులు

కరెంట్‌ కోతలతో ఇబ్బందులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి

కొత్తూర్‌, సెప్టెంబరు 10: మండల కేంద్రంలో సమయం పాలన లేకుండా కరెంట్‌ కోతలు విధిస్తుండడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ఎంపీటీసీ సభ్యుడు జంగగళ్ల కృష్ణతో పాటు పలువురు సభ్యులు అవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ హాల్‌లో ఎంపీపీ పి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన శనివారం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాలక్ష్మీ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో తరుచూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్‌ నిలిచిపోతుండడంతో కంటిమీద కునుకులేకుండా మారిందని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఎంపీపీ స్పందిస్తూ వెంటనే సమస్యను పరిష్కారించాలని ట్రాన్స్‌కో ఏఈ సాయికృష్ణను అదేశించారు. అనంతరం వివిధ సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శోభలింగంనాయక్‌, తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, ఎంపీవో నర్సింహులు, డాక్టర్లు కార్తీక్‌, స్ఫూర్తి, ఏవో గోపాల్‌, ఏఈలు కవితాస్రవంతి, హేమంత్‌, సాయికృష్ణ, రవీందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖాల అధికారులు పాల్గొన్నారు.  

Read more