సమస్యలను సత్వరం పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-20T05:28:25+05:30 IST

సమస్యలను సత్వరం పరిష్కరించాలి

సమస్యలను సత్వరం పరిష్కరించాలి
వినతులు స్వీకరిస్తున్న మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌

మేడ్చల్‌ అర్బన్‌/వికారాబాద్‌/ధారూరు/బషీరాబాద్‌, సెప్టెంబరు 19: ప్రజావాణిలో వచ్చే వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించే లా అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 47 వినతులు వచ్చాయి. ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిష్కరించాలని చెప్పారు. డీఆర్వో లింగ్యానాయక్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పై అధికారులు దృష్టి సారించాలని వికారాబాద్‌ ఆర్డీవో అశోక్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి 140దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపరిష్కారంపై తహసీల్దార్లు దృష్టి సరించాలన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరిస్తే జిల్లా కేంద్రం వరకు ఫిర్యాదులు రావన్నారు. ఆర్డీవో విజయకుమారి, ఏవో అమరేందర్‌, కలెక్టర్‌ కార్యాలయ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ధారూరులో ప్రజావాణికి మూడు దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్‌ భువనేశ్వర్‌ తెలిపారు. అలాగే బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 3 ఫిర్యాదులు వచ్చినట్టు తహసీల్దార్‌ ఎన్‌.వెంకటస్వామి తెలిపారు. వీటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యుటీ తహసీల్దార్‌ వీరేషంబాబు, సీనియర్‌ ఆసిస్టెంట్‌ వెంకటేశం పాల్గొన్నారు.

Read more