విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రదానం

ABN , First Publish Date - 2022-07-07T05:30:00+05:30 IST

విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రదానం

విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రదానం
ఉత్తమ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేస్తున్న పాపిశెట్టి రాము

ఆమనగల్లు/కడ్తాల్‌/యాచారం, జూలై 7: పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి కళ్యాణమండపంలో గురువారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులను ప్రదానం చేశారు. లయన్స్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము తన సోదరుడు పాపిశెట్టి శ్రీనివాసులు, బావ వాడకట్టు మనోహార్‌ జ్ఞాపకార్థం అవార్డులను అందజేశారు. నాలుగు మండలాల పరిధిలోని 27జిల్లాపరిషత్‌, నాలుగు కేజీబీవీ, మైసిండి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 100మంది విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ విద్యార్థులను పాపిశెట్టి రాము శ్వేత, పాపిశెట్టి కౌసల్యకుమారస్వామి, అరవింద్‌ కళ్యాణి, శ్రీదేవి, రాజేశ్వరిలు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్‌, కృష్ణయ్య, చల్మారెడ్డి, పద్మ, సుదర్శన్‌ రెడ్డి, వెంకటేశ్‌, జంగయ్య, విజయ, అనిత, తిరుపతయ్య, శ్రీనివాసరావు, విజయ, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలోని మైసిగండికి చెందిన అనూష పదోతరగతిలో 10జీపీఏ సాధించగా స్థానిక పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ తులసీరామ్‌నాయక్‌  విద్యార్థిని సత్కరించారు. కార్యక్రమంలో రాందా్‌సనాయక్‌, తులసీరామ్‌, యాదగిరి, రాజు, చిన్న, కృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా పాఠశాల ఆవరణలో గురువారం అభినందన సభ నిర్వహించారు. నందివపర్తి సర్పంచ్‌ ఉదయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో పదోతరగతిలో ఉన్న 59మంది ఉత్తీర్ణులవడం ఉపాధ్యాయుల కృషి ఫలితమేనన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషన్‌ ఉన్నారు.  

Updated Date - 2022-07-07T05:30:00+05:30 IST