కోర్టుల ఏర్పాటుకు భవనాలు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST

కోర్టుల ఏర్పాటుకు భవనాలు సిద్ధం

కోర్టుల ఏర్పాటుకు భవనాలు సిద్ధం

ఆమనగల్లు, మే 24: ఆమనగల్లు పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి, మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుల ఏర్పాటుకు భవనాలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినం జూన్‌ 2వ తేదీ వరకు కోర్టు ప్రారంభం దిశగా న్యాయ శాఖ చర్యలు చేపట్టింది. కల్వకుర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జికోర్టు పరిధిలోని ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు కలిపి ఆమనగల్లులో కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో పాత సమావేశ భవనం, కార్యాలయ భవనం, రెండు క్వార్టర్లను కోర్టు ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఆయా భవనాలను రంగారెడ్డి జిల్లా జడ్జి సీహెచ్‌ హరికృష్ణ భూపతి, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జి ప్రేమావతి, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి ఆయా భవాలను పరిశీలించి కోర్టుకు అనుకూలంగా ఉన్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయా భవనాలకు పెయింటింగ్‌ పనులను ప్రారంభించారు. 

సత్వర న్యాయ సేవలకే కోర్టు ఏర్పాటు: ఎమ్మెల్యే 

 ప్రజలకు సత్వరన్యాయ సేవలందించేందుకు ప్రభుత్వం, న్యాయశాఖ కొత్త కోర్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో కోర్టు ఏర్పాటుకు సిద్ధం చేస్తున్న మండల పరిషత్‌ ఆవరణలోని భవనాలను మంగళవారం ఆయన పరిశీలించారు.భవనాల ఆధునీకరణ, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయించి నెలాఖరుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ అనురాధ పత్యానాయక్‌, నేనావత్‌ పత్యానాయక్‌,  తోట గిరియాదవ్‌, ఆంజనేయులు, శేఖర్‌, మల్లేశ్‌, నాగరాజు, మధు, కమటం వెంకటయ్య, సయ్యద్‌ ఖలీల్‌, గుత్తి బాలస్వామి, భాస్కర్‌, ఎండీ. రజాక్‌, వెంకటేశ్‌, రమేశ్‌, తోట కృష్ణ, తదితరులు ఉన్నారు.  

Read more