చోరీల నివారణకు జాగ్రత్తలు పాటించాలి: సీఐ

ABN , First Publish Date - 2022-10-03T05:57:25+05:30 IST

చోరీల నివారణకు జాగ్రత్తలు పాటించాలి: సీఐ

చోరీల నివారణకు జాగ్రత్తలు పాటించాలి: సీఐ
షాబాద్‌: బస్టాండ్‌లో ప్రయాణికులకు సూచనలు చేస్తున్న సీఐ గురువయ్యగౌడ్‌

షాబాద్‌, అక్టోబరు 2: చోరీల నివారణకు ప్రజ లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని షాబాద్‌ సీఐ గురువయ్యగౌడ్‌ అన్నారు. షాబాద్‌లో బస్టాండ్‌ ఆవరణలో ఆదివారం ప్రయాణికులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ సమయంలో ఊరెళ్లేవారు విలువైన బంగారం, వెండి, నగదును బ్యాంకుల్లో భద్రపర్చుకోవాలన్నారు. తాళం వేసి ఊరు వెళ్లాల్సి వస్తే పోలీ్‌సస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామంలో గానీ, కాలనీలో గానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదా డయల్‌ 100కు తప్పనిసరిగా ఫోన్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు సత్యం, బాల్‌రాజ్‌, మహేశ్వర్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Read more