‘రాహుల్‌ పాదయాత్రతో రాజకీయ మార్పు’

ABN , First Publish Date - 2022-09-08T05:53:52+05:30 IST

‘రాహుల్‌ పాదయాత్రతో రాజకీయ మార్పు’

‘రాహుల్‌ పాదయాత్రతో రాజకీయ మార్పు’

షాద్‌నగర్‌అర్బన్‌, సెప్టెంబరు 7: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టబోతున్న భారత్‌ జోడో పాదయాత్రతో దేశవ్యాప్తంగా రాజకీయ మార్పు వస్తుందని షాద్‌నగర్‌ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని కందివనం గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. దళితవాడలో వినాయకుడి వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాబర్‌ఖాన్‌, శ్రీశైలం, సయ్యద్‌ ఖదీర్‌, అందె మోహన్‌, తుపాకుల శేఖర్‌, సుదర్శన్‌, గుట్ట రాజు, కలాల్‌ నర్సింహులుగౌడ్‌, పెంటయ్య, నాగరాజు, యాదగిరి పాల్గొన్నారు. 

Read more