జలం పుష్కలం..సాగు సంబురం

ABN , First Publish Date - 2022-07-19T04:56:50+05:30 IST

జలం పుష్కలం..సాగు సంబురం

జలం పుష్కలం..సాగు సంబురం
రుద్రారం-నాగసమందర్‌ గ్రామాల మధ్య అలుగు పారుతున్న కోట్‌పల్లి ప్రాజెక్టు

 కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్‌ జిల్లాలో  ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించు కున్నాయి.   ఒక పక్క చెరువులు, ప్రాజెక్టులు  మత్తడి దూకుతున్నాయి.  ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి  ధారూరు మండల పరిధిలోని  కోట్‌పల్లి  ప్రాజెక్టు అలుగు పారుతోంది.  రాకపోకలకు అంతరాయం కలిగింది. మరో పక్క  మధ్యమధ్యలో వరణుడు విరామం ఇవ్వడంతో   రైతులు  సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.  బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌, ఎక్మాయి, నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్‌, నవాంద్గీ తదితర గ్రామాల పరిధిలో సాగు సందడి నెలకొంది.  వరినాట్లు వేస్తూ  మహిళా కూలీలు   బిజీబిజీగా ఉన్నారు.

-బషీరాబాద్‌/ధారూరు, జూలై18 (ఆంధ్రజ్యోతి)

Read more