గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలి

ABN , First Publish Date - 2022-07-19T05:10:35+05:30 IST

గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలి

గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలి
యాచారం: నల్లవెల్లి పంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్న ఎంపీడీవో

యాచారం/ఇబ్రహీంపట్నం/శంకర్‌పల్లి, జూలై 18: నేడు పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో హరితహారం కింద విరివిగా మొక్కలు నాటి కాపాడాలని యాచారం ఎంపీడీవో విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె చింతపట్ల, నల్లవెల్లి, మాల్‌ గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయా గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలతో పాటు బృహత్‌పల్లె ప్రకృతివనాలను పరిశీలించారు. మురుగు నిలవకుండా మురుగుకాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం పట్ల పంచాయతీ సిబ్బందిని అభినందించారు. తాగునీరు కాలుషితం కాకుండా పైప్‌లైన్‌ లీకేజీ కాకుండా చూడాలన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని సూచించారు. హరితహరంకింద విరివిగా మొక్కలు నాటించడంతో పాటు మొక్కలు ఎండిపోకుండా విద్యార్థులకు దత్తత ఇవ్వాలని చెప్పారు. ఆమె వెంట ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని ఉప్పరిగూడలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఇంటింటా తిరిగి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు.  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, టైలు, బెల్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సింహారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌, జితేందర్‌రెడ్డి, పద్మమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా శంకర్‌పల్లిలో ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి హరితహారంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. హరితహారంను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, ఏపీఎం  ఉన్నారు.  

Updated Date - 2022-07-19T05:10:35+05:30 IST