వ్యవసాయ భూముల్లో భాస్వరాన్ని తగ్గించుకోవాలి

ABN , First Publish Date - 2022-07-19T05:29:02+05:30 IST

వ్యవసాయ భూముల్లో భాస్వరాన్ని తగ్గించుకోవాలి

వ్యవసాయ భూముల్లో భాస్వరాన్ని తగ్గించుకోవాలి
రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఈవో

కందుకూరు, జూలై 18: రైతులు సాగుచేస్తున్న వ్యవసాయ భూమిలో భాస్వరాన్ని తగ్గించుకోవాలని కందుకూరు వ్యవసాయ విస్తరణ అధికారి లక్‌మల్ల రాజు అన్నారు. మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన రైతు బొక్క దామోదర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం  రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. రైతులు పంటలను సాగు చేసే ముందు భూసారపరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. అధికంగా రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో భాస్వరం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి, రైతులు బొక్క ప్రభాకర్‌రెడ్డి, బొక్క మధుసుధన్‌రెడ్డి, సౌడపు లక్ష్మయ్యగౌడ్‌, బొక్క లోకేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, బొక్క జైపాల్‌రెడ్డి, పాల్గొన్నారు. 

Read more