చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-06T05:25:28+05:30 IST

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూలై 5 : ప్రమాదవశాత్తు వేడి నూనె శరీరంపై పడటంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మంగళవారం మృతిచెందిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... బేగంపేటలోని పాటిగడ్డకు చెందిన ముస్తాఫా(35) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో ఈ నెల 3న ఘట్‌కేసర్‌ మండలం, అవుశాపూర్‌లోని చాంద్‌బాబా దర్గా వద్ద డబల్‌ కా మీఠా చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడి నూనె ముస్తాఫా శరీరంపై పడింది. దీంతో ముస్తాఫాను చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • లారీకింద పడి ఒకరు..

జమ్మికుంట రూరల్‌, జూలై 5: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలోని ఇసుక క్వారీలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లారీకింద పడి మృతిచెందాడు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం జీడి గడ్డ తండాకు చెందిన కేతావత్‌ గోదానాయక్‌(48) ఇసుక తీసుకు వె ళ్లేందుకు తన లారీలో డ్రైవర్‌తో కలిసి తనుగుల క్వారీకి మంగళవారం వ చ్చాడు. ఇసుక నింపుకుని క్వారీ నుంచి వస్తుండగా డ్రైవర్‌కు గోదానాయక్‌ సూచనలు చేస్తున్నాడు. ఈక్రమంలో కాలుజారి గోదాన్‌నాయక్‌ లారీకింద పడడంతో కాలు తొడభాగం నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు చికిత్స నిమిత్తం హన్మకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

Read more