పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించాలి

ABN , First Publish Date - 2022-11-16T00:13:10+05:30 IST

పెండింగ్‌లో ఉన్న పోడు భూముల దరఖాస్తులు పరిష్కరించాలని వికారాబాద్‌ ఆర్డీవో అరుణకుమారి తెలిపారు.

పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించాలి

పోడు భూములపై అధికారులకు వికారాబాద్‌ ఆర్డీవో సూచన

కులకచర్ల, నవంబరు 15 : పెండింగ్‌లో ఉన్న పోడు భూముల దరఖాస్తులు పరిష్కరించాలని వికారాబాద్‌ ఆర్డీవో అరుణకుమారి తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫారెస్ట్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండల పరిధిలోని 9 గ్రామాల నుంచి పోడు భూములకై 1227 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు 422 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించబడ్డాయని తెలిపారు. జిల్లాలోనే అత్యధికంగా కులకచర్ల మండలంలోనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వాటిని పరిశీలించాలని సూచించారు. మండలానికి అదనంగా రెవెన్యూ, ఫారెస్ట్‌, ఇతర సిబ్బందిని నియమిస్తామని, 3 రోజుల్లో పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని తెలిపారు. తహసీల్దార్‌ రమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు. అలాగే ఆర్డీవో చౌడాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పోడుభూముల పెండింగ్‌ దరఖాస్తులపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, డీటీడీవో కోటాజీ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:13:18+05:30 IST

Read more